బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో షారూఖ్ ఖాన్ ను ఆయన సిబ్బంది.. హుటాహుటిన అహ్మదాబాద్ లోని కె.డి. ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
జాతీయ మీడియాలో మాత్రం షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి. కొందరు డీ హైడ్రేషన్ వల్ల ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇతర కారణాల వల్ల హాస్పటల్ లో చేరినట్లు చెబుతున్నారు. ఎవరి కథనాలు ఎలా ఉన్నా.. షారూఖ్ ఖాన్ అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవటం మాత్రం వాస్తవం అంటున్నారు.
అనారోగ్యం, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ వార్తలపై షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ నుంచి.. అతని కంపెనీ అయిన రెడ్ చిల్లీస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసేస్తున్నారు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.