మన హీరోలు.. మా హీరో అంటూ చొక్కాలు చింపుకుంటారు ఫ్యాన్స్.. కొత్త సినిమా రిలీజ్ రోజు టికెట్ రేట్లు పెంచితే.. అప్పులు చేసి మరీ టికెట్లు కొంటారు ఫ్యాన్స్.. అలాంటి సినిమా అభిమానుల్లో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారో తెలియదు కానీ.. సినిమా హీరోలు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోల లిస్టు చూస్తే.. వారి ఆస్తుల వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆ వేల కోట్లు సంపాదించిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరో చూద్దామా..
>>> బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ఆస్తులు 7 వేల 300 కోట్ల రూపాయలు. సినిమాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, యాడ్స్ ద్వారా సంపాదించారు. నెంబర్ వన్ స్థానం ఇతనిదే..
>>> జూహ్లీచావ్లా ఆస్తులు 4 వేల 600 కోట్ల రూపాయలు. సినిమాలు, వ్యాపారం, క్రికెట్ లో పెట్టుబడుల ద్వారా సంపాదించారు. రెండో స్థానం ఈమెదే.
>>> హీరో హృతిక్ రోషన్.. ఇతని ఆస్తులు 2 వేల కోట్ల రూపాయలు. సినిమాలు, యాడ్స్, స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడులు. మూడో స్థానంలో ఉన్నారు.
>>> అమితాబ్ బచ్చన్ ఆస్తులు 16 వందల కోట్ల రూపాయలు. సినిమాలు, షోలు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా సంపాదించారు. అమితాబ్ ది నాలుగో స్థానం.
>>> కరణ్ జోహార్. దర్శక, నిర్మాత. ఇతని ఆస్తులు 14 వందల కోట్ల రూపాయలు. సినిమా ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్, టీవీ షోలు, యాడ్స్ ద్వారా సంపాదించారు. ఐదో స్థానంలో ఉన్నారు.
హురున్ ఇండియా సినిమా సెలబ్రిటీల రిచ్ లిస్ట్ లో మొదటి ఐదు స్థానాల్లో ఈ హీరోలు ఉన్నారు. వీళ్లందరూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. టెక్నాలజీ, సోషల్ మీడియాతోపాటు స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదించినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది.
మరో విశేషం ఏంటంటే.. ఇదంతా అధికారికంగా వారి ప్రకటించిన ఆస్తులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న విలువ. వీరి ఆస్తులను మార్కెట్ విలువ కింద లెక్కిస్తే మాత్రం డబుల్, ట్రిపుల్ లో ఉంటాయనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.