IPL 2024 Final: గంభీర్, షారుఖ్ ఖాన్ పాక్ సంతతి వారు: పాక్ మీడియా జర్నలిస్టు

IPL 2024 Final: గంభీర్, షారుఖ్ ఖాన్ పాక్ సంతతి వారు: పాక్ మీడియా జర్నలిస్టు

ఐపీఎల్ లో పాకిస్థాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కు సపోర్ట్ చేసింది. కేకేఆర్ గెలవగానే సంబరాలు కూడా చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. పాక్ మీడియా కథనాలు ఇలానే చెప్పుకొస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. కోల్ కతా కో ఓనర్ షారుఖ్ ఖాన్.. మెంటార్ గౌతమ్ గంభీర్ ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన వారేనని అక్కడి మీడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం షారుఖ్, గంభీర్ ఇండియాలోనే ఉంటున్న వారి పూర్వికులు పాక్ సంతతి వారికి చెందినవారట. 
              
షారుఖ్ ఖాన్, గౌతమ్ గంభీర్ పూర్వీకులు పాకిస్తాన్ నుండి వచ్చారని.. షారూఖ్ తండ్రి పెషావర్‌కు చెందినవారని అంటున్నారు. ఇక గంభీర్ కుటుంబం పాకిస్థాన్ లోనే నివసిస్తుందని.. అతని తాత ముల్తాన్, అమ్మమ్మ కరాచీకి చెందినవారని చెప్పుకొస్తున్నారు. మరి ఈ మాటల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. షారుఖ్, గంభీర్ మధ్య మంచి అనుబంధమున్న సంగతి తెలిసిందే. 

గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ 2012, 2014 సీజన్ లలో ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. షారుఖ్ ఓనర్ గా ఉంటున్న ఈ జట్టుకు గంభీర్ టైటిల్ తీసుకొనిరావడంతో ఇద్దరి మధ్య బంధం బలంగా మారింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో గంభీర్ లక్నో నుంచి తన పాత జట్టు కేకేఆర్ కు వచ్చేశాడు. గౌతీ మెంటార్ గా కేకేఆర్ జట్టులోకి అడుగుపెట్టగానే కేకేఆర్ ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. 

Also Read: కోల్‌కతాకే సపోర్ట్.. జాన్వీ కపూర్‌ను నిరాశ పరిచిన స్టార్క్

ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ పై జరిగిన ఫైనల్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడో ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. కేకేఆర్ ఫైనల్లో గెలిచిన అనంతరం షారుఖ్ గంభీర్ తలపై ముద్దు పెట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత ఈ సీన్ హైలెట్ గా నిలిచింది.