బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Harani) తెరకెక్కించిన ఈ సినిమాలో తాప్సి పన్ను(Tapsi Pannu) హీరోయిన్ గా నటించారు. కామెడీ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సాలార్ కు పోటీగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది డంకీ మూవీ. అయినప్పటికీ మంచి వసూళ్లనే రాబట్టింది ఈ మూవీ. మొదటోజు వందకోట్ల చేరువలో కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ లాంగ్ రన్ లో రూ.470 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక డంకీ సినిమా రిలీజై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికే ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ డంకీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలో డంకీ సినిమాను దించేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ లో గత రాత్రి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అనుకోకుండా వచ్చిన అప్డేట్ తో అటు షారుఖ్ ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి.