బాలీవుడ్ నటులకు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. ఒకడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటే, మరొకడు షారుఖ్ ఖాన్‌ను లేపేస్తానంటున్నాడు.
ముంబై, బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం(నవంబర్ 05) బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు హత్యా బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాద్ షా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాల్ చేసిన నిందితులు.. రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే షారుఖ్‌ను లేపేస్తామని బెదిరించారు.
బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే సిబ్బంది బాంద్రా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా నిందితుడి ఆచూకీ కోసం గాలించడం మొదలు పెట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు మీద నమోదైన నంబర్ నుండి ఈ కాల్స్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ నెట్టింట వైరల్ అవుతోంది.