- 50 లక్షలు ఇవ్వకుంటే చంపుత అని చత్తీస్‌గఢ్ నుంచి కాల్
ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ నుంచి ఓ యువకుడు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌చేసి.. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే షారుఖ్ ఖాన్ ను చంపేస్తామని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్నంబర్ఆధారంగా ఆ యువకుడిని ట్రేస్చేసి నిందితుడిని ఫైజాన్గా గుర్తించారు. అనంతరం అక్కడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షారుక్ ఖాన్‌కు గత అక్టోబర్‌లోనూ ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది.
అతడు ముంబై అండర్ వరల్డ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు అతనికి భద్రత పెంచారు. ప్రస్తుతం అతనికి వైప్లస్భత్రతను కల్పిస్తున్నారు. ఎప్పుడూ ఆరుగురు సాయుధ సిబ్బంది షారుక్ కు రక్షణగా ఉంటారు. కాగా, ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో పాటు ఇతర మరికొన్ని గ్రూపుల నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. బుధవారం రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు సల్మాన్ ఖాన్ కు చంపేస్తానని ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతని కర్నాటకలో అరెస్టు చేశారు.