అత్యధిక ట్యాక్స్ చెల్లిస్తున్న స్టార్ హీరోలు వీరే...

ఇండియాలో అత్యధిక ట్యాక్స్ చెల్లిస్తున్న సెలబ్రిటీల లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రెండో స్థానంలో నిలిచాడు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ కు గాను షారుఖ్ అత్యధికంగా 92కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించగా... విజయ్ 80కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించి రెండో స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ వంటి సెలబ్రిటీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

షారుఖ్ పఠాన్, జవాన్, డుంకి వంటి వరుస సినిమాలు చేసి తన సత్తా చాటాడు. విజయ్ గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రస్తుతం గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనౌన్స్ చేసిన నాటి నుండి మంచి అంచనాలు క్రియేట్ అయిన ఈ సినిమా గురువారం ( సెప్టెంబర్ 5, 2024 ) రిలీజయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

Also Read :- రామం రాఘవం నుంచి..తండ్రి గొప్పదనం తెలిపే ఎమోషనల్ సాంగ్ రిలీజ్