
బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ ఈమధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసాయి. ఈ సినిమాల తర్వాత షారుఖ్ ఖాన్ స్క్రిప్ట్స్ ని ఎంచుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా నటుడు షారుఖ్ ఖాన్ మేనేజర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
షారుఖ్ ఖాన్ దగ్గర ముంబై కి చెందిన పూజ దద్లాని అనే మహిళ 12 ఏళ్లుగా మేనేజర్ గా పని చేస్తోంది. పూజ షారుఖ్ ఖాన్ కి చెందిన లీగల్ విషయాలు, పర్సనల్ డేట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వంటివి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇందుకుగానూ ఒక్క ఏడాదికి దాదాపుగా రూ.7 నుంచి రూ.9 కోట్లు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం.. ఇంతపెద్ద మొత్తంలో జీతం అందుకుంటున్నట్లు తెలియడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు..
అయితే టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మేనేజర్ కి రూ.10 నుంచి రూ.12 కోట్లు జీతం ఇస్తున్నట్లు సమాచారం. ఇవేకాకుండా ఒక్కో సినిమాకి హీరో బాగోగులు, డేట్లు చూసుకున్నందుకు అదనంగా ప్రొడ్యూసర్ నుంచి అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య షారుఖ్ ఖాన్ తన నట వారసులుగా కూతురు సుహానే ఖాన్, కొడుకు ఆర్యన్ ఖాన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో యువ దర్శకుల నుంచి మంచి కథలు కూడా వింటున్నట్లు సమాచారం.