Industry Debut: స్టార్ హీరో కొడుకు కోసం.. కదిలొస్తున్న ఇండస్ట్రీ స్టార్స్.. ఎలాంటి కథంటే?

Industry Debut: స్టార్ హీరో కొడుకు కోసం.. కదిలొస్తున్న ఇండస్ట్రీ స్టార్స్.. ఎలాంటి కథంటే?

స్టార్ హీరోల కొడుకులు ఆ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోలుగా ఎంట్రీ ఇస్తుండడం కామన్. అయితే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మాత్రం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘ది బ్యాడస్‌‌ ఆఫ్‌‌ బాలీవుడ్‌‌’ పేరుతో ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల అనౌన్స్‌‌మెంట్‌‌ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. షారుఖ్‌‌కు చెందిన రెడ్ చిల్లీస్‌‌తో కలిసి నెట్‌‌ఫ్లిక్స్‌‌ దీన్ని నిర్మిస్తోంది. ‘కిల్‌‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న లక్ష్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సహేర్ బంబా హీరోయిన్. బాబీ డియోల్‌‌, మోనా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read :- సిద్ధార్థ్ హీరోగా మన ఇంటి కథ

బాలీవుడ్ మూవీ మేకింగ్‌‌పై ఓ సెటైర్‌‌‌‌లా ఇది ఉండబోతోందట. అంతేకాదు ముగ్గురు ఖాన్స్‌‌ షారుఖ్, ఆమీర్, సల్మాన్ ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, దర్శకులు రాజమౌళి, కరణ్ జోహార్‌‌‌‌ తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.

దీన్ని బట్టి చూస్తుంటే స్టార్ హీరో కొడుకు కోసం ఇండస్ట్రీ మొత్తమే కదిలొస్తోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి షారుఖ్‌‌ తనయుడు దర్శకుడిగా ఎలాంటి కథతో వస్తున్నాడనేది ఆసక్తిగా మారింది.