గుంటూరు కారం సినిమాపై షారుఖ్ ట్వీట్.. ఇది నా ఫ్రెండ్ మహేష్ మాస్ రైడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntuur kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Triviram) తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటించారు. ముందు నుండే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. మొదటి రోజు ఏకంగా రూ.94 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నాన్ రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేసింది గుంటూరు కారం మూవీ. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాప్ స్టార్ సైతం గుంటూరు కారం సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.  

ఇందులో భాగంగానే తాజాగా గుంటూరు కారం మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. గుంటూరు కారం సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఇది నా స్నేహితుడు మహేష్ బాబు యాక్షన్ అండ్ మాస్ రైడ్.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన మహేష్ బాబు ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక షారుఖ్ నటించిన జవాన్ రిలీజ్ సమయంలో మహేష్ కూడా షారుఖ్ సినిమా గురించి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దానికి బదులుగా షారుఖ్ కూడా రిప్లయ్ ఇచ్చారు. ఇప్పుడు షారుఖ్ కూడా అదే పనిచేశారు. దీంతో ఈ ఇద్దరి స్టార్స్ స్నేహం చూసి మ్యూచువల్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.