ఇటీవల విడుదలై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిసున్న పఠాన్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చెన్నైలోని నయనతార, విఘ్నేశ్ శివన్ ల ఇంటికి వెళ్లారు. గతేడాది వివాహం చేసుకొని, ఆ తర్వాత సరోగసీ ద్వారా నయన్, విఘ్నేశ్ లు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో వారి పిల్లలను చూసేందుకు షారూక్ వచ్చినట్టు తెలుస్తోంది. డెరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే చెన్నైలో జరిగింది.
ఈ క్రమంలోనే చైన్నైలోని ఎగ్మోర్‌లో ఉన్న నయనతార ఇంటికి షారుఖ్ వెళ్లినట్టు సమాచారం. అనంతరం షారూక్ ఖాన్, నయనతారతో కలిసి ఇంటి బయటకు వచ్చేశారు. దీంతో అక్కడున్న కొంతమంది వెంటనే వారిని గుర్తుపట్టి, సినీ నటులను చూసేందుకు ఉత్సాహం చూపించారు. షారుఖ్ కారు ఎక్కిన తర్వాత నయన్ కు బాయ్ చెప్తూ.. అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నయనతార కూడా త్వరలోనే 'జవాన్' సెట్స్‌లో చేరి సినిమాలోని చివరి సన్నివేశాలను పూర్తి చేయనున్నట్టు సమాచారం.