కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. వరల్డ్ వైడ్గా హర్డ్ కోర్ ఫ్యాన్స్ను పెంచుకున్న షారుఖ్..తన సినిమాలతో ఎప్పుడు అలరిస్తుంటారు. ఇక లేటెస్ట్గా రిలీజైన జవాన్ మూవీ థియేటర్స్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతుంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ థియేటర్లలో చేసే సందడి మాములుగా లేదు. ఈ క్రమంలో నెట్టింట ఓ హార్ట్ టచ్చింగ్ వీడియో వైరల్గా మారింది.
ఇక రీసెంట్గా..ఒక హాస్పిటల్లో వెంటిలేటర్తో ఉన్న ఓ దివ్యాంగుడు జవాన్ సినిమా చూసేందుకు థియేటర్కి వెళ్ళాడు. స్ట్రెచర్ సహాయంతో థియేటర్కి వచ్చిన అతనికి, నిర్వాహకులు స్పెషల్ ఆరెంజ్ మెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలతో పోరాడుతున్న కానీ షారుఖ్ పై ఉన్న వీరాభిమానంతో.. సినిమా చూసి తన ప్రేమను చాటుకున్నాడు.
- ALSO READ | వెంకటేష్ సైంధవ్ నుంచి ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్
ఈ వీడియో చూసిన హీరో షారుఖ్ స్పందిస్తూ..మీరు చూపించిన ప్రేమకు నేను చాలా కృతజ్ఞుడిని. మీపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని కదిలించే ఈ వీడియోకు ..నెటిజన్స్ ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అలాగే రీసెంట్గా, హాస్పిటల్లో పేషంట్ డ్రెస్లో ఉన్న ఓ మహిళ కూడా..జవాన్ మూవీలోని ఛలోన సాంగ్కు స్టెప్పులేస్తూ సందడి చేసింది. దీంతో షారుఖ్ స్పందిస్తూ.. ఇది చాలా బాగుంది. థాంక్యూ, మీరు త్వరగా కోలుకుని జవాన్ సినిమా చూడండి. అంతేకాదు మీరు హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక మరో డాన్స్ వీడియో చేయాలి. దాని కోసం నేను ఎదురు చూస్తాను. లవ్ యూ.. అంటూ ట్వీట్ చేశారు.
తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో..నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ..సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.760 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.