
ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఐటీ అధికారులతో జరిగిన కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే షారుఖ్ ఖాన్ రావణ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే సినిమా షూటింగ్ దాదాపుగా 70% శాతానికిపైగా యూకే దేశంలో జరిగింది. దీంతో ఈ సినిమాకి సంబందించిన ట్యాక్స్ వివరాలు యూకే దేశ టర్మ్స్ అండ్ కండీషన్స్ పై ఆధారపడి ఉంటాయి.
అయితే 2011-2012 సంవత్సరానికిగానూ రూ. 83.42 కోట్లు పన్ను చెల్లిస్తున్నట్లు, అలాగే యూకేలో చెల్లించే ట్యాక్స్ విషయంలో విదేశీ క్రెడిట్స్ కోసం షారుఖ్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ దరఖాస్తుని తిరస్కరించారు. అంతేకాకుండా 4 ఏళ్ళ తర్వాత ఈ ట్యాక్స్ మొత్తం రూ.84.17 కోట్లు అని, మొత్తం ట్యాక్స్ కట్టాలని షారుఖ్ ఖాన్ కి అధికారులు తెలిపారు.
ALSO READ | Abhinaya Engagement: పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఆ స్టార్ హీరోనేనా..?
దీంతో షారుఖ్ ఖాన్ ITAT(ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్) ని ఆశ్రయించాడు. అయితే ఈ పన్ను చెల్లింపుల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ కేసుని పరిశిలించారు. ఇందులోభాగంగా షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అలాగే కేసు నమోదైన 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీ కరెక్షన్ చెయ్యడం సరికాదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి చురకలంటించారు. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో షారుఖ్ ఖాన్ కి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా నటుడు షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపుగా రూ.1500 కోట్లు(గ్రాస్) పైగా కలెక్ట్ చేసాయి.