పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. రెండోసారి ఎన్నిక

పాకిస్టాన్ ప్రధానిగా PNL-N, PPP కూటమి అభ్యర్థి షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి షెహబాజ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆదివారం (మార్చి3) ఉదయం పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశంలో ప్రధానమంత్రిగా షెహబాజ్ ను ఎన్నుకున్నారు. షెహబాజ్ 201 ఓట్లను సాధించారు. ప్రత్యర్థి ఒమర అయూబ్ ఖాన్ కు 92 ఓట్లు వచ్చాయి. మాజీ ప్రధాని ఇమ్రాన ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన రాజకీయ గ్రూపు శాసన సభ్యులు సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) మద్దతు పలికారు. ఎన్నికల చట్టాలను ఉల్లంఘించినందున PTI పోటీ చేయకుండా నిషేధం విధించింది పాక్ ఎన్నికల సంఘం. 

ప్రస్తుతం  PMLN  అధ్యక్షుడిగా ఉన్న షెహబాజ్ 336 మంది సభ్యుల సభలో ప్రధాని గా ఎన్నిక కావాలంటే 169 ఓట్లు అవసరం ఉండగా దాదాపు 201 మంది శాసన సభ్యుల మద్దతు లభించింది. దీంతో పాక్ ప్రధానిగా ఎన్నికయ్యారు. షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే 16 నెలల పాటు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు.72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఆగస్టు వరకు పాక్ ప్రధానిగా పనిచేశారు. జాతీయ ఎన్నికల ముందు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు .ఇతను పాకిస్తాన్ కు మూడు ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ సోదరుడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు షెహబాజ్ షరీఫ్.