ఊహను మించి జరిగే నమ్మలేని నిజాలను అదృష్టంగా భావిస్తారు. అందుకే అదృష్టం ఎవరి తలుపు తడుతుందో ఊహించలేము. అదృష్టం కలిసివస్తే బికారీ కోటీశ్వరుడు అవుతాడు. అదృష్టం కలిసిరాకపోతే కోటీశ్వరుడు రాత్రికి రాత్రే బికారీ అయిన సందర్భాలున్నాయి. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం అదృష్టం కలిసి వచ్చి ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్కరోజులోనే అతనికి రూ. 1.50 కోట్లు దక్కాయి.
రూ. 49తో రూ. 1.50 కోట్లు
మధ్య ప్రదేశ్‌లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో క్రికెట్ గేమ్ ఆడడం అలవాటు. రెండేళ్లుగా ఈ యాప్ ద్వారా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కట్టినా రూ.49 కి మించి కట్టడు. ఎప్పుడు బెట్టింగ్ కట్టినా డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ ఐపీఎల్ లో షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తాజాగా షహబుద్దీన్‌కు లక్ చిక్కింది. ఐపీఎల్ 2023లో కోల్‌కతా, పంజాబ్ మధ్య నిర్వహించిన ఆన్‌లైన్ గేమింగ్‌లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్లు దక్కాయి. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
రూ. 1.50 కోట్లు దక్కించుకున్న షాహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుంచి రూ. 20 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. అందులో రూ.6 లక్షలు పన్నులకు పోగా.. మిగిలిన రూ. 14 లక్షలు అతని బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన నగదుతో మన్సూరీ కొత్త ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.