అది 2022 టీ 20 ప్రపంచ కప్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. 160 పరుగుల లక్ష్య చేధనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు.. చివరి 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి.. ఈ మ్యాచ్ లో ఇది భారత్ పరిస్థితి. భారత్ ఓడిపోతుందని సగటు భారత అభిమాని ఆశలు వదిలేసుకుంటున్నాడు. కానీ క్రీజ్ లో ఉంది ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఏదైనా అద్భుతం జరగకపోదా అని అందరూ ఆశించారు. అనుకున్నట్లుగానే కోహ్లీ భారత్ ను ఈ మ్యాచ్ లో గెలిపించాడు.
8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో 19 వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి భారత్ విజయంపై ధీమా పెంచాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో అనేక నాటకీయ పరిణామాల మధ్య భారత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. విరాట్ సంచలన ఇన్నింగ్స్ కు పాకిస్తా పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది ఫిదా అయిపోయాడు.కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ తాను చూసిన ఇన్నింగ్స్ ల్లో బెస్ట్ అని ప్రశంసించాడు. ఇదే మ్యాచ్ లో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో కోహ్లీ సిక్సర్ కొట్టిన స్ట్రయిట్ సిక్సర్ నమ్మశక్యంగా లేదని షాహీన్ ఆఫ్రిది స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు.
ఈ ఇన్నింగ్స్ కోహ్లీ కెరీర్ లోనే కాదు టీ20 వరల్డ్ కప్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ల్లో ఒకటిగా నిలిచింది. 9వ ఓవర్ 5 వ బంతికి కోహ్లీ కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే కాదు టోర్నీ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో బాడీని బ్యాలన్స్ చేస్తూ లాంగాన్ మీదగా కోహ్లీ కొట్టిన ప్రపంచ క్రికెట్ ను విస్తు గొలిపింది. క్రికెట్ లో ఎన్నో వినూత్నమైన షాట్స్ ఉన్నా ఈ షాట్ ప్రత్యేకం. ఈ షాట్ ను ఐసీసీ "షాట్ ఆఫ్ ది సెంచరీ" గా ప్రకటించింది. ఏకంగా ఐసీసీనే షాట్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించిందంటే ఈ షాట్ ఎంత మందికి నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు.
Shaheen Afridi said, "Virat Kohli's 82* is the best innings I've witnessed by far".
— Nimrit Sinh (@Nimritye) August 21, 2024
T-20 World Cup Final Innings was also equally good according to me pic.twitter.com/FSw96jbNEn