PAK vs SA: హీటెక్కిన వార్.. సఫారీ బ్యాటర్‌పై దూసుకెళ్లిన పాక్ బౌలర్

PAK vs SA: హీటెక్కిన వార్.. సఫారీ బ్యాటర్‌పై దూసుకెళ్లిన పాక్ బౌలర్

కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో బుధవారం (ఫిబ్రవరి 12) పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కేతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 28 ఓవర్ ఐదో బంతి తర్వాత బ్రీట్జ్కేతో అఫ్రిది ఏదో మాట్లాడుతూ అతనివైపు చిరాకుగా చూశాడు.   ఆన్-ఫీల్డ్ అంపైర్ తో పాటు మొహమ్మద్ రిజ్ వాన్, టెంబా బావుమా జోక్యం చేసుకొని గొడవను సర్ది చేశారు. 

గొడవ పోయిందనుకున్న సమయంలో 28 ఓవర్లో చివరి బంతి వేసిన తర్వాత మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. షాహీన్ వేసిన చిన్న బంతిని బ్రీట్జ్కే డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన తర్వాత అతను సింగిల్ కోసం పరిగెత్తాడు. పరుగు తీస్తున్న సమయంలో అఫ్రిదిని  బ్రీట్జ్కే ఢీ కొట్టాడు. దీంతో అఫ్రిది కోపంతో బ్రీట్జ్కే చూసి మరోసారి గొడవకు దిగాడు. బ్రీట్జ్కే కూడా అఫ్రిది వైపు కోపంగా చూస్తూ మాట్లాడాడు. ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే ఇద్దరి మధ్య ఒకే ఓవర్లో రెండు సార్లు గొడవైంది.

ALSO READ | SL vs AUS: అసలంక వన్ మ్యాన్ షో.. కోహ్లీ రికార్డు దిగువకు

గొడవ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ లో బ్రీట్జ్కే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. బ్రీట్జ్కే తో పాటు కెప్టెన్ బవుమా (82), క్లాసన్ (87)  రాణించడంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది రెండు వికెట్లు  తీసుకున్నాడు. నజీమ్ షా, ఖుషీదిల్ చెరో వికెట్ పడగొట్టారు.