
రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన పాకిస్తాన్ తుది జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో శుక్రవారం నుంచి మొదలయ్యే రెండో టెస్ట్‌లో పేసర్ షాహిన్ ఆఫ్రిది లేకుండానే బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో నలుగురు పేసర్లను తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్నర్లను తీసుకుని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండో టెస్ట్‌కు పేసర్ల సంఖ్యను మూడుకు తగ్గించారు. ఈ మేరకు పరిస్థితులను అర్థం చేసుకోవాలని చీఫ్ కోచ్‌జాసన్‌గిలెస్పీ.. ఆఫ్రిదికి సూచించారు. కొన్ని రోజులు ఫ్యామిలీతో గడిపి రావాలని పేసర్‌ను కోరినట్లు సమాచారం. బ్రేక్ టైమ్‌లో ఆఫ్రిది.. అజర్ మహ్మద్‌తో కలిసి బౌలింగ్‌ను మెరుగుపర్చుకోనున్నాడు.