Shaheen Shah: మగబిడ్డకు జన్మనిచ్చిన షాహీన్ షా ఆఫ్రిది భార్య.. సెలబ్రేషన్ వైరల్

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది తండ్రయ్యాడు. అతని భార్య అన్షా ఆఫ్రిది శనివారం (ఆగస్టు 24) మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈబిడ్డకు అలీ యార్ అని పేరు పెట్టారు. ప్రముఖ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిది కూతురుతో షహీన్ ఆఫ్రిది ఫిబ్రవరి 2023లో మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కెప్టెన్ బాబర్ ఆజం మరియు షాదాబ్ ఖాన్‌తో సహా పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు. 2021 లో వీరి నిశ్చితార్ధం జరిగింది. 2023 లో మరోసారి భార్యనే అఫ్రిది మరోసారి వివాహం చేసుకోవడం విశేషం. సెప్టెంబర్ 19 న మరోసారి ఈ వీరి వివాహం జరిగింది. 

ప్రస్తుతం అఫ్రిది స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రావల్పిండిలో జరుగుతున్న తొలి టెస్ట్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో బంగ్లా ప్లేయర్ హసన్ మహమ్మద్ వికెట్ తీసిన తర్వాత రెండు చేతులు ఊపుతూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో జరగబోయే రెండో టెస్టుకు ఈ పాక్ పేసర్ దూరమయ్యే అవకాశం ఉంది. కొడుకు పుట్టడంతో కుటుంబంతో గడపడానికి తన సొంత ఊరికి వెళ్లనున్నాడు. ఈ మ్యాచ్ లో అఫ్రిది మొత్తం 30 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు.