భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ కిక్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే స్టేడియం నిండిపోతుంది. ఆ దేశాల అభిమానులే కాదు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ద్వైపాక్షిక సిరీస్ లు పక్కన పెడితే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే ఇప్పటివరకు టీమిండియాపై పాక్ ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. వరల్డ్ కప్ వస్తే పాక్ పై భారత్ విజయం ఏకపక్షంగా ముగుస్తుంది. ఈ సారి కూడా పటిష్టమైన టీమిండియాను పాక్ జట్టు ఓడించడం అసాధ్యంగానే కనిపిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు రేపు న్యూయార్క్ వేదికగా తలబడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు అమెరికాతో ఆడిన తొలి మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. అయితే భారత్ బలంగా కనిపించినా పాక్ సమిష్టిగా ఆడితే విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో పాక్ తమ పేసర్లపైనే భారం వేసింది.
అఫ్రిది, నసీం షా మెరుస్తారా..?
పాకిస్థాన్ లో భారీ హిట్టర్లు లేకపాయినా వారి బలమంతా పేసర్లే. ఆ జట్టులో షహీన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్, మహమ్మద్ అమీర్ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరిలో అఫ్రిది, నసీం షా తమ పేస్ బౌలింగ్ తో చెలరేగితే భారత్ కు కష్టాలు తప్పవు. కొత్త బంతితో వీరు తమ స్వింగ్ తో భారత్ టాపార్డర్ ను పెవిలియన్ కు చేరిస్తే పాక్ విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. 2021, 2022 టీ20 వరల్డ్ కప్ లో పాక్ పేసర్లు ఇదే చేసి చూపించారు. వీటిలో 2012 వరల్డ్ కప్ లో పాక్ గెలిచింది. మరోసారి పాక్ ఈ మ్యాజిక్ రిపీట్ చేయాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు.