- వైస్ చైర్మన్‌గా స్వామి షెట్టి రాజేందర్ ఎన్నిక
కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్‌గా షాహిన్ సుల్తానా, వైస్ చైర్మన్‌గా స్వామి శెట్టి రాజేందర్ ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్ మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా అది నెగ్గింది. దీంతో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం కాగజ్ నగర్ ఆర్డీఓ సురేశ్ బాబు అధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో నూతన చైర్ పర్సన్‌గా షాహిన్ సుల్తానా (19వ వార్లు), వైస్ చైర్మన్‌గా స్వామి శెట్టి రాజేందర్ (15వ వార్డు)ను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గానూ సమావేశానికి 26 మంది హాజరయ్యారు.
వీరంతా ఏకగ్రీవంగా చైర్మన్ , వైస్ చైర్మన్‌ను ఎన్నుకున్నారు. మాజీ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్ కూడా హాజరు కావడం విశేషం. కొత్తగా ఎన్నికైనవారితో స్పెషల్ ఆఫీసర్ సురేశ్‌బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.