
రెండేళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ ఐసీసీ ఈవెంట్స్ లో చెత్త ప్రదర్శన చేస్తుంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయినా దాయాధి జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ లో కనీసం సూపర్ 8 దశకు చేరుకోలేకపోయింది. సొంతగడ్డపై ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనిరాశే మిగిలింది. సొంతగడ్డపై ఒక్క విజయం లేకుండానే టోర్నీ ముగించింది. పాకిస్థాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆ దేశంలోని సొంత అభిమానులే పాకిస్థాన్ ఆట తీరుపై మండిపడుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని తన అభిప్రాయాన్ని చెప్పాడు.
నిజం చెప్పాలంటే తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూ లో ఉందని బహిరంగంగా విమర్శించాడు. పాకిస్థాన్ క్రికెట్ లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ జాతీయ టీ20 జట్టులోకి తిరిగి రావడాన్ని అఫ్రిది తప్పుపట్టాడు. షాదాబ్ ను సెలక్ట్ చేయడమే కాకుండా అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై తప్పు పట్టాడు. దేశవాళీ క్రికెట్ ను ప్రాతిపాదికగా తీసుకోకుండా షాదాబ్ ఖాన్ అసలు ఎలా ఎంపిక చేస్తారని ఫైర్ అయ్యాడు. నిలకడ లేకపోవడం.. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలనే పాకిస్థాన్ క్రికెట్ క్షీణ దశకు వచ్చిందని ఈ మాజీ ఆల్ రౌండర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు.
Also Read:-ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి.. ఏ జట్టు ఎంత గెలుచుకుందంటే..?
తరచూ జరిగే నాయకత్వ మార్పులపై అయన విచారం వ్యకతం చేశాడు. ఇలాంటి అస్థిరత ఉంటే ఎలా పురోగతి సాధిస్తుందని అఫ్రిది ప్రశ్నించాడు. కోచ్‌లు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆటగాళ్లను నిందించడం, యాజమాన్యం తమ సీట్లను కాపాడుకోవడానికి ఆటగాళ్లను కోచ్‌లను నిందించడం చూడటం బాధాకరం అని అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ మార్చి 16 నుంచి 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లనుంది. సల్మాన్ అఘా పాక్ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు.
Shahid Afridi makes bold remarks against PAK players and PCB pic.twitter.com/8AsfiVOUXI
— SportsTiger (@The_SportsTiger) March 12, 2025