Champions Trophy 2025: కోహ్లీ మా దేశానికి వస్తే ఇండియాని మర్చిపోతాడు: షాహిద్ అఫ్రిది

Champions Trophy 2025: కోహ్లీ మా దేశానికి వస్తే ఇండియాని మర్చిపోతాడు: షాహిద్ అఫ్రిది

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కు టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజా సమాచార ప్రకారం పాకిస్థాన్ గడ్డపై జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించటం లేదట. టీమిండియా ఆటగాళ్లు సైతం ఇంట్రస్ట్ గా లేరనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలో ఐసీసీతో బీసీసీఐ చర్చించనుంది. 

ఒకవేళ భారత్ పాకిస్థాన్ కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు జరుగుతాయి. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అలానే జరుగనున్నట్లు తెలుస్తోంది.  

భారత క్రికెట్ జట్టు పాక్ లో పర్యటించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మాజీ క్రికెటర్లతో పాటు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు పాకిస్థాన్ కు రావాలని కోరుకుంటున్నారు. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ విషయంపై తాజాగా స్పందించి తమ దేశానికి భారత్ వస్తే బాగుటుందని తన మనసులో మాట వెల్లడించాడు. 

"నేను టీమ్‌ఇండియాకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను. పాకిస్థాన్‌ జట్టు భారత్ లో పర్యటించినప్పుడు భారత్‌ నుంచి మాకు ఎంతో గౌరవం, ప్రేమ లభించాయి. 2005-2006 లో పాక్ లో భారత్ పర్యటించినప్పుడు టీమిండియా ఆటగాళ్లందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. విరాట్ కోహ్లీ పాకిస్థాన్ కు వస్తే అతను ఇండియాపై ఉన్న ప్రేమను, ఆతిథ్యాన్ని మర్చిపోతాడు. కోహ్లీకి పాకిస్థాన్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అని అఫ్రిది న్యూస్ 24తో అన్నారు.