India vs Pakistan: ఈ జనరేషన్ ఇండియా, పాక్ స్టార్ క్రికెటర్లకు అగ్రెస్సివ్ నెస్ లేదు: షాహిద్ అఫ్రిది

India vs Pakistan: ఈ జనరేషన్ ఇండియా, పాక్ స్టార్ క్రికెటర్లకు అగ్రెస్సివ్ నెస్ లేదు: షాహిద్ అఫ్రిది

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్లు ఆడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండటం గ్యారంటీ. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ 2013 నుంచి ఇండియా, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేస్తుంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దాయాధి జట్లను ఒకే గ్రూప్ లో ఆడనున్నారు. టోర్నీ మొత్తంలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రేజ్ తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య దూకుడు.. వార్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాయి. 

క్రికెట్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌కు మించిన క్రేజ్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సొంతం. మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్, పాకిస్థాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టీమిండియా పాకిస్థాన్ లో పర్యటించడానికి నిరాకరించడంతో ఇరు జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత్, పాక్ మాజీ క్రికెటర్ల మధ్య సరదాగా జరిగిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

Also Read :- ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

ఇండియా, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు.. ఈ రోజుల్లో ఆటగాళ్లలో దూకుడు లేకపోవడం గురించి షాహిద్ అఫ్రిదిని అడిగారు. దీనికి అఫ్రిది సమాధానం వైరల్ గా మారుతుంది. " ఆజ్ కల్ కే ప్లేయర్స్ సబ్ మెక్‌డొనాల్డ్స్, KFC వాలే హై (నేటి ఆటగాళ్లు మెక్‌డొనాల్డ్స్, KFC తరం)" అని అఫ్రిది అన్నారు. అఫ్రిది ప్రస్తుత జనరేషన్ ఆటగాళ్లలో అసలు అగ్రెస్సివ్ నెస్ లేదని.. వారు తిని చిల్ రావడంతోనే సరిపోతుందని విమర్శించారు. స్టార్ క్రికెటర్ల మధ్య మాట్లా యుద్ధం జరగట్లేదని.. అసలు మ్యాచ్ లో కిక్ లేదని అఫ్రిది పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ..ఇండియా- పాకిస్తాన్ మధ్య సంబంధం మియా-బీవీ లాంటిది అని చెప్పాడు. ఉదయం వారు గొడవ పడతారు.. సాయంత్రానికి కలిసి తింటారు" అని ప్యానెల్‌లో భాగమైన యువీ అన్నాడు. 1990 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ ఈవెంట్ లలో తరచూ తలపడుతూ వస్తున్నాయి. ఐసీసీ టోర్నీలో టీమిండియాదే స్పష్టమైన ఆధిక్యం. మరోవైపు పాకిస్థాన్ చివరిసారిగా 2021  టీ20 వరల్డ్ కప్ లో ఇండియాపై గెలిచింది.