ఖాళీగా డబ్బులు లేకుండా ఎన్నోసార్లు హైదరాబాద్ వీధుల్లో..ప్రపంచం మాదే అనేలా తిరిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డాడు అనే దానికంటే..ఎన్నో ప్రయత్నాలు చేశాడనే చెప్పొచ్చు. ఇక పెళ్లి చూపులు సినిమా తీసి నేషనల్ అవార్డు కూడా సాధించాడు.
అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విజయ్ మరోవైపు నిర్మాతగానే కాక క్లాత్ బ్రాండింగ్, థియేటర్స్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల వాలీబాల్ టీమ్‌లోనూ ఇన్వెస్ట్ చేసి.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే..అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ (Shahid Kapoor)2019లోకబీర్ సింగ్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకున్నాడు. దీంతో షాహిద్..విజయ్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
తాజాగా వీరిద్దరూ ఒకే స్టేజిపై కలిశారు. మంగళవారం (మార్చి 19న) ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఓ ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కు అన్ని సినీ పరిశ్రమల నుంచి టాప్ సినీ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.
ఈ సందర్బంగా షాహిద్ కపూర్,విజయ్ ఇద్దరూ ఒకే స్టేజ్ పై మెరిసి తమ ఫ్యాన్స్ ని అబ్బురపరిచారు. ఈ వేదికపై షాహిద్ కపూర్ మాట్లాడుతూ..'విజయ్ దేవరకొండ వల్లే నాకు అర్జున్ రెడ్డి లాంటి మంచి సినిమా ఆఫర్ వచ్చింది..ఒకవేళ విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నాకు కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు. దీంతో అక్కడున్న వారందరికి వావ్ మూమెంట్ చూసిన ఫీలింగ్ కలిగింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్,వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.