ముంబై: ఈవారం మూవీ లవర్స్ కు పండగే. సినీ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి ఒక్క రోజు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ కూడా బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో విడుదల కానున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ కోసం హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ ఎందుకని ఓ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీసు బరి నుంచి తప్పుకుంది. హిందీ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను.. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
#Xclusiv... BREAKING NEWS... #Jersey POSTPONED by one week... Will arrive in *cinemas* on 22 April 2022... The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV
— taran adarsh (@taran_adarsh) April 11, 2022
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన జెర్సీని మరోమారు పోస్ట్ పోన్ చేయడంపై షాహిద్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మంచి విజయం సాధించింది. ఇదే మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతం తిన్ననూరి హిందీ వెర్షన్ కూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన మృణాళి ఠాకూర్ నటిస్తోంది. పంకజ్ కపూర్, రోనిత్ కర్మ, శిషిర్ శర్మ ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్, సితార ఎంటర్ టైన్మెంట్, బ్రాట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం: