బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్నాడు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan) సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్స్ దగ్గర షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పఠాన్(Pataan) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కింగ్ ఖాన్.. జవాన్ సినిమాతో అంతకుమించి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది.
సెప్టెంబర్ 1న భారీ అంచనాల మధ్య ప్రేక్షలకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను మొదటి రోజు ఏకంగా రూ.120 కోట్లకు పైగా గ్రాస్.. రూ.70 కోట్లకు పైగా నెట్ వసూల్ రాబట్టినట్టి సమాచారం. బాలీవుడ్ లో ఈ ఫీట్ అందుకున్న ఒకేఒక హీరోగా షారుఖ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా మొదటి రోజు రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టలేదు. ఇంతకు ముందు ఆ రికార్డ్ షారుఖ్ నటించిన గత చిత్రం పఠాన్ పేరుమీద ఉంది. ఇప్పుడు జవాన్ సినిమాతో తన రికార్డ్ తానే తిరగరాసుకున్నాడు షారుఖ్.
Alos Read :- టాలీవుడ్ నిర్మాతలకు ఐబొమ్మ గట్టి వార్నింగ్
ఇక బాలీవుడ్ లో తానే నెంబర్ వన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ బాద్షా. ఇక సినిమాను యూనానిమస్ హిట్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోవడం కూడా జవాన్ సినిమాకు కలిసొచ్చే అంశంకానుంది. కాబట్టి ఈ సినిమా కూడా ఈజీగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది అంటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది గనక జరిగితే.. వరుసగా రెండు రూ.1000 కోట్ల సినిమాలున్న హీరోగా షారుఖ్ రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు.