డ్రగ్స్ కేసు: షారుఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ

డ్రగ్స్ కేసు:  షారుఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది ముంబయి కోర్టు. ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాల బెయిల్ పిటిషన్ ను రిజెక్ట్ చేసింది. ముంబయి తీరంలోని క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ తో పాటు 8 మందిని NCB అరెస్ట్ చేసింది. ఆర్యన్ సహా 8 మందికి నిన్న 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది ముంబయిలోని ఎస్ ప్లాండే కోర్టు. దీంతో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఇవాళ విచారణకు రాగా... పిటిషన్ ను తిరస్కరించింది ఎస్ ప్లాండే కోర్టు. నిందితులందరిని ఆర్థర్ జైల్ కు తరలించారు. వారిని 3 నుంచి 5 రోజుల పాటు క్వారంటైన్ సెల్ లో ఉంచనున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

అఫైర్లు, అబార్షన్ రూమర్లపై సమంత రియాక్షన్

కేసీఆర్.. నీది నాలుకా లేక తాటి మట్టా?: కోమటిరెడ్డి

భారత్‌పై గెలిస్తే బ్లాంక్ చెక్.. పాక్ ప్లేయర్లకు బంపర్ ఆఫర్