రింకూ సింగ్ కి షారుఖ్ ఖరీదైన గిఫ్ట్

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 9న కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుంది కదా. నాకు తెలిసి క్రికెట్ లవర్స్ ఎవరూ ఆ మ్యాచ్ ని అంత ఈజీగా మర్చిపోలేరు.ఆ మ్యాచ్ లో కోల్కతా ఆటగాడు రింకూ సింగ్ అద్భుతం చేశాడనే చెప్పాలి. ఆఖరి ఓవర్లో 5 బంతుల్లో 28 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు.. రింకూ ఆడిన తీరు నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్కతాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

అయితే ఆ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచిన రింకూ సింగ్ ఆటతో KKR ఓనర్ షారూక్ ఖాన్ చాలా ఇంప్రెస్ అయ్యి రింకూకు కాల్ చేసిన అభినందించాడట. ఇక అదే రోజు పఠాన్ మూవీ పోస్టర్ కు రింకూ సింగ్ ఫేస్ ను జోడించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు షారూక్.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకూ సింగ్.. షారుక్ తనతో ఎం మాట్లాడాడో వివరించాడు. "తన ఆట తీరుకు షారూక్ చాలా ఇంప్రెస్ అయ్యారని, ఇలాంటి ప్రదర్శనను భవిష్యత్తులోనూ తన నుండి ఆశిస్తున్నట్లు చెప్పాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తన పెళ్లి రోజు షారూక్ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడని చెప్పాడు రింకూ సింగ్. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? అనేది మాత్రం రివీల్ చేయలేదు రింకూ.