హైదరాబాద్, వెలుగు: కెప్టెన్ షేక్ రషీద్ (203) డబుల్ సెంచరీ, కిరణ్ షిండే (109) సెంచరీతో రాణించడంతో హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దక్కించుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు168/3 తో ఆట కొనసాగించిన ఆంధ్ర మూడో రోజు, శుక్రవారం చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 448/9 స్కోరు చేసింది. రషీద్, కిరణ్ నాలుగో వికెట్‌కు 236 రన్స్ జోడించారు. భరత్ (33) ఫర్వాలేదనిపించగా.. విహారి (0), విజయ్ (12) ఫెయిలయ్యారు. సందీప్ (33 బ్యాటింగ్), లలిత్ మోహన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అనికేత్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆంధ్ర 147 రన్స్ లీడ్‌లో కొనసాగుతోంది.
Shaik #Rasheed slams maiden first class #hundred to put #Andhra in command in #RanjiTrophy2024 match in #Hyderabad #HydvsAP pic.twitter.com/ZWkDrhkwCv
— Shiva Krishna (@ShivaKrishnaG) November 15, 2024