మార్చి 15లోపు 50%  వస్త్రం అందించాలి :  శైలజా రామయ్యార్

మార్చి 15లోపు 50%  వస్త్రం అందించాలి :  శైలజా రామయ్యార్
  • రాష్ట్ర హ్యాండ్లూమ్స్ టెక్స్‌‌‌‌టైల్స్‌‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్స్ టెక్స్‌‌టైల్స్‌‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన ఆసాములు, కార్మికులతో శుక్రవారం రివ్యూ నిర్వహించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారో తెలుసుకున్నారు.

మార్చి 15లోగా ఆర్డర్లలో 50శాతం అందజేయాలని ఆమె సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్, మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు. గతంలో తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని, సెస్ విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ సమస్య పరిష్కరించాలని, యంత్రాల కొనుగోలు తదితర అంశాలకు సాయం అందించాలని నేతన్నలు ప్రిన్సిపల్​సెక్రటరీని కోరారు.

జిల్లాలోని అర్హులకు  బ్యాంకు లోన్లు  అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు.  వివిధ శాఖల బకాయిలను కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సూచించారు. సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, టీజీఎస్​కో జీఎం రఘునందన్, ఏడీ సందీప్ జోషి గౌతమ్,  హ్యాండ్లూమ్స్ టెక్స్‌‌టైల్స్‌‌ ఏడీ  సాగర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు