ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి

ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి

వికారాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలంలోని క్వాంటం లైఫ్ ఫౌండేషన్​లో నిర్వహించిన బ్రహ్మ జ్ఞాన దివస్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా శైలజా రామయ్యర్​ మాట్లాడుతూ.. అందరూ ధ్యానం గురించి తెలుసుకోవాలన్నారు. ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి, సినీ నటి రెజీనా, బీజేపీ రాష్ట్ర లీడర్​ విజేందర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, లైఫ్ ఫౌండేషన్ ట్రస్టీలు, ఆచార్యులు పాల్గొన్నారు.