ప్రజలు మార్పు కోరుకున్నారు : మహమ్మద్​ షకీల్ అమేర్

బోధన్, వెలుగు:  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని  మాజీ ఎమ్మెల్యే ఎండీ.  షకీల్​అమేర్​అన్నారు.   మంగళవారం బోధన్​ పట్టణంలోని అప్నా పంక్షన్​ హాల్‌లో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   గెలుపొటములు సహజమన్నారు.  

తాము స్వల్ప తేడా తో ఓడినా, తాము ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్యన ఉండి పోరాటం చేస్తామన్నారు.  తమకు 10 ఏళ్ల పాటు అవకాశం కల్పించి  ఆశీర్వదించారన్నారు.  ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించిన బోధన్​ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.  కాంగ్రెస్​ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ  స్కీములను నెల రోజుల్లోనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.  

అందులో ముఖ్యంగా ఫించన్లు ప్రతి నెల 4  వేలు ఇవ్వాలని, రైతు బంధు వెంటనే అమలు చేయాలని, మహాలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని,  కరెంటు బిల్లులు ఇక నుంచి ప్రజలు కట్టవద్దని సూచించారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం రెండు నెలల కూడా పని చేయదని విమర్శించారు.    రెండు నెలల తర్వాత మళ్ళీ బీఆర్‌‌ఎస్​ గవర్నమెంట్​ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌, ​ రజిత యాదవ్​, డీసీసీబీ  డైరెక్టర్​గిర్దవార్ గంగారెడ్డి,  మార్కెట్​ కమిటీ చైర్మన్‌​ వీఆర్‌‌ దేశాయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.