ముల్తాన్: వెస్టిండీస్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ తడబడింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్ తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 41.3 ఓwవర్లలో 143/4 స్కోరు చేసింది. సౌద్ షకీల్ (56 బ్యాటింగ్), మహ్మద్ రిజ్వాన్ (51 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
జేడెన్ సీల్స్ (3/21) మూడు వికెట్లు తీశాడు. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ (11), మహ్ముద్ హురైరా (6), బాబర్ ఆజమ్ (8), కమ్రాన్ గులామ్ (5) నిరాశపర్చారు. దీంతో 46/4తో కష్టాల్లో పడ్డ ఇన్నింగ్స్‌ను షకీల్, రిజ్వాన్ ఐదో వికెట్‌కు 97 రన్స్ జోడించి ఆదుకున్నారు.