ఐడెంటిటీ పరేడ్​కు షకీల్ కొడుకు డుమ్మా

ఐడెంటిటీ పరేడ్​కు షకీల్ కొడుకు డుమ్మా

పంజాగుట్ట, వెలుగు: బీర్ఎస్  మాజీ ఎమ్మెల్యే షకీల్​ కొడుకు రాహేల్  అలియాస్  సోహైల్ ఐడెంటిటీ పరేడ్ కు డుమ్మా కొట్టాడు. నిరుడు మద్యం మత్తులో ప్రజాభవన్​ వద్ద డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో నిందితుడిగా ఉన్న రాహేల్..​ కోర్టు నిబంధనల ప్రకారం సోమవారం పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఐడెంటిటీ పరేడ్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ, పరేడ్ కు రాకుండా కోర్టు నిబంధనలను అతడు ధిక్కారించాడని పంజాగుట్ట డివిజన్​ ఏసీపీ మోహన్  కుమార్​ తెలిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఏ చర్యలు తీసుకోవాలో కోర్టే తెలుపుతుందని ఆయన చెప్పారు.