రోహిత్ శర్మని చూసి నేర్చుకో.. తమీమ్‌పై బంగ్లా కెప్టెన్ ఫైర్

రోహిత్ శర్మని చూసి నేర్చుకో.. తమీమ్‌పై బంగ్లా కెప్టెన్ ఫైర్

బంగ్లాదేశ్ క్రికెట్ లో సీనియర్ ఆటగాళ్ళైన తమీమ్ ఇక్బాల్‌, షకీబుల్ హసన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పూర్తి ఫిట్ నెస్ లేని కారణంగా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన తమీమ్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు. తాను వరల్డ్ కప్ లో ఉండడానికి అర్హుడనే అని తెలియజేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. 

ALSO READ: వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ స్పిన్నర్ ఔట్
  
తాజాగా తమీమ్ మాటలపై షకీబ్ స్పందిస్తూ అతనిపై విరుచుకుపడ్డాడు. T- స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమీమ్ మాటలను దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. వ్యక్తిగత ఆశయాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పాడు. జట్టు గెలవాలంటే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సహచర ప్లేయర్లకు సూచించాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. "నీకు నచ్చినట్టు నువ్వు చెయ్? అని చెప్పడమే కరెక్టా? టీమ్ ముఖ్యమా? ప్లేయర్ ముఖ్యమా? రోహిత్ శర్మ తన కెరీర్ ఆరంభంలో నెం.7లో బ్యాటింగ్ చేశాడు. 10 వేలకు పైగా పరుగులు చేశాడు. తమీమ్ ఇక్బాల్ ఇప్పుడు నెం.3 లేదా నెం.4 లో బ్యాటింగ్ చేస్తే అదేమైనా పెద్ద సమస్యా? ఇది మరీ మూర్ఖత్వం" అని చెప్పుకొచ్చాడు

కాగా.. షకీబ్ ని నెంబర్-4 లో బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరితే తమీమ్ దానికి నో చెప్పాడు. తమీమ్ డిమాండ్లను తిరస్కరించిన షకీబ్.. ఒకవేళ అతణ్ని గనుక వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటే.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని బీసీబీని హెచ్చరించాడు. తమీమ్‌ను జట్టులోకి తీసుకుంటే తాను ప్రపంచ కప్ ఆడబోనంటూ షకీబ్ బోర్డుకి తేల్చి చెప్పాడు.