బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బంగ్లా ఆల్ రౌండర్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ కు బిగ్ షాక్ తగిలింది. షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా అతడిని నిషేధిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం (డిసెంబర్ 15) అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం షకీబ్ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో బౌలింగ్ చేయడం కుదరదు. అతడు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గానే ఆడాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ షకీబ్ అల్ హసన్ ను నిషేధం విధించినట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి సమాచారం అందింది. ఇంగ్లాండ్ నిషేధం అనంతరం బంగ్లాదేశ్ సైతం అతనిపై చర్యలు తీసుకుంది. అతడిని అంతర్జాతీయ క్రికెట్‌లో.. దేశవాళీ క్రికెట్ నుంచి బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తున్నట్టు బిసిబి ప్రకటన తెలిపింది. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన షకీబ్.. సోమర్‌సెట్‌తో జరిగిన పోరులో 9 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం అతని బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు.
Also Read:-పొరపాటుగా ఆ పదం వాడాను.. బుమ్రాకు మహిళా కామెంటేటర్ క్షమాపణలు..
షకీబ్ ఈ నెల ప్రారంభంలో లాఫ్‌బరో విశ్వవిద్యాలయంలో బౌలింగ్ పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆ టెస్టులో అతని బౌలింగ్ యాక్షన్‌లో మోచేయి పొడిగింపు మించిపోయినట్లు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం, మోచేతి పొడిగింపు 15 డిగ్రీల థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉండాలి. కానీ, షకీబ్ ఆ పరిధిని మించిపోతున్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ ససెన్షన్ వేటు వేసింది. ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈసీబీ అధికారులు వెల్లడించారు.
🚨 SHAKIB AL HASAN SUSPENDED FROM BOWLING IN INTERNATIONAL CRICKET. 🚨 pic.twitter.com/nkz8G8UF8t
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2024