మహిళా వ్యాపారులకు శక్తి అవార్డులు

మహిళా వ్యాపారులకు శక్తి అవార్డులు

‌‌హైదరాబాద్, వెలుగు: మహిళా వ్యాపారులకు కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌‌ప్రెన్యూర్స్ (సీఓడబ్ల్యుఈ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఉమెన్ ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ ఎంట్రప్రెన్యూర్షిప్ (డబ్ల్యుఐఎస్ఈ), బీ2బీ ఎక్స్‌‌పోలో శనివారం మహిళా వ్యాపారులకు శక్తి అవార్డులను అందజేశారు. 

మొత్తం 108 మంది మహిళలకు వీటిని ప్రదానం చేశారు. ఈ సదస్సు సస్టైనబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ, రూరల్​ ఎంట్రప్రెన్యూర్షిప్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం గ్లోబల్ మార్కెట్ అనుసంధానం అనే అంశాలపై దృష్టి సారించింది.  ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం, మహిళా వ్యాపారులను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు.