పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్

పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రిన్సిపల్​ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్​ శక్తికాంత దాస్​ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్​అపాయింట్​మెంట్స్​ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాస్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని, ఆయన పదవీకాలం ప్రధాని టర్మ్​ ముగిసేవరకు లేదా తదుపరి ఆర్డర్స్​ వచ్చే వరకు ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుతం ప్రధాని ప్రిన్సిపల్​ సెక్రటరీగా పీకే మిశ్రా ఉన్నారు. ఇప్పుడు రెండో ప్రిన్సిపల్​ సెక్రటరీగా శక్తికాంత దాస్​ నియమితులయ్యారు. ఇటీవలే ఆర్బీఐ గరవ్నర్​గా ఆయన రిటైర్​ అయ్యారు. కాగా, నీతి ఆయోగ్​ సీఈవో బీవీఆర్​ సుబ్రహ్మణ్యం పదవీకాలాన్ని  మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.