Sakunthalakkayya: శకుంతలక్కయ్యా విన్నారా.. వెన్నెల కిషోర్ మూవీ స్పెషల్ సాంగ్‌‌ అదుర్స్

Sakunthalakkayya: శకుంతలక్కయ్యా విన్నారా.. వెన్నెల కిషోర్ మూవీ స్పెషల్ సాంగ్‌‌ అదుర్స్

వెన్నెల కిషోర్ టైటిల్‌‌ రోల్‌‌లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా, మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘శకుంతలక్కయ్యా..’అంటూ సాగే  స్పెషల్ సాంగ్‌‌ను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ ఎనర్జిటిక్ పార్టీ బీట్స్‌‌తో కంపోజ్ చేసిన పాటకు కాసర్ల శ్యామ్ మాసివ్ లిరిక్స్ రాశారు. ఉమా నేహా పాడిన విధానం ఇంప్రెస్ చేసింది.

అనన్య నాగళ్ల, శియా గౌతమ్ హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహదాస్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.