టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. గణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.జనవరి 9న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శకుంతల, దుష్యంతుల కథగా రూపొందిన ఈ మూవీని దర్శకుడు గుణశేఖర్ ఒక ఆకట్టుకునే విజువల్ వండర్ గా అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున్న రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, సమంత ఇటీవల యశోద ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు.