- ఉత్తమ పీఎస్ కేటగిరీలో 8వ స్థానం
- ప్రకటించిన కేంద్ర హోం శాఖ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్స్ కేటగిరీలో 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్‌లో జరిగిన డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పోలీస్ స్టేషన్స్‌గా ఎంపికైన పీఎస్‌లను జాబితాను కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక కావడం పట్ల శాలిబండ పోలీసులు సహా సిటీ పోలీసులను డీజీపీ జితేందర్, సిటీ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. ఈ గుర్తింపు తెలంగాణ పోలీస్ విభాగం నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మక పోలీసింగ్ విధానాలకు నిదర్శనమన్నారు. ఈ జాతీయ గుర్తింపు తెలంగాణ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, సమర్థవంతమైన చట్టాల అమలు, అంకితభావంతో చేసిన సేవలకు గాను గుర్తింపు లభించిందన్నారు.