భూభారతి సదస్సులో ఉద్రిక్తత.. రైతు మెడ పట్టుకుని బయటకు గెంటేసిన ఎస్ఐ

భూభారతి సదస్సులో ఉద్రిక్తత.. రైతు మెడ పట్టుకుని బయటకు గెంటేసిన ఎస్ఐ

నల్గొండ జిల్లా  శాలిగౌరారం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతు పోతరాజుపై ఎస్ఐ సైదులు అత్యుత్సాహం ప్రదర్శించారు.  రైతును మెడపట్టి బయటకు తోసేశాడు. 

 రైతు పోతురాజు తన సమస్యను  కలెక్టర్ కి, ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి స్టేజి పైకి వెళుతుండగా అధికారులు అడ్డుకుంటుండగా శాలి గౌరారం ఎస్సై సైదులు వాగ్వాదానికి దిగాడు. ఏంట్రా నువ్వు చెప్పేదంటూ రైతు మెడబట్టి  బయటకు గెంటివేశాడు.  తమ సమస్యలు అధికారులకు చెప్పుకోవచ్చని వస్తే పోలీసులు అతి చేశారు అంటూ రైతులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

►ALSO READ | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు..

ఎంజి కొత్తపల్లిలో పొలం దగ్గర  బాట పంచాయతీ విషయమై పలుమార్లు రైతు సంకటి పోతరాజు ఎమ్మార్వో కి ,  ఎస్ఐకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని  ఆవేదన వ్యక్తం చేశాడు.   రైతు పోతరాజు పొలంలో ఉన్న స్టార్టర్లను , మోటార్లను తీసుకెళ్తున్నారంటూ పలుమార్లు ఎస్ఐకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అదే విషయం చెప్పకుండా అడ్డుకుంటున్నాడంటూ పోతరాజు ఆవేదన వ్యక్తం చేశారు.