మహారాష్ట్రలో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‎ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్రలో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‎ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‎పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కలమ్నా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షాలిమార్ ఎక్స్‎ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

ALSO READ | దేశవ్యాప్తంగా సీఆర్పీఎస్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

షాలిమార్ ఎక్స్‎ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలంలో యుద్ద ప్రాతిపదికన రైల్వే సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను క్రేన్ల సహయంతో పక్కకు తొలగించి.. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.