మహిళా కానిస్టేబుల్ మంచి మనసు

మహిళా కానిస్టేబుల్ మంచి మనసు
  • మహిళా కానిస్టేబుల్ మంచి మనసు
  • దివ్యాంగురాలిని ఎత్తుకొని మెట్లు దింపింది


హైదరాబాద్  : మహిళా కానిస్టేబుల్ మంచి మనసు చాటుకుంది.  నూతన సంవత్సరాన్ని పురస్కరించకొని రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం అర్థరాత్రి వరకు 2021కి వీడ్కోలు పలికిన ప్రజలు..కేక్ లు కట్ చేసి జోష్ తో 2022 సంవత్సరానికి స్వాగతం పలికారు. రాత్రంతా సంబురాల్లో మునిగితేలి..శనివారం ఉదయం ఆలయాలకు క్యూకట్టారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో అన్ని ఆలయాల్లో రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్ కు  భక్తుల పోటెత్తారు. భక్తుల రద్దీతో  కిటకిటలాడుతున్న సమయంలో దివ్వాంగురాలైన ఓ భక్తురాలు మెట్లు దిగలేక ఇబ్బందులు పడింది. ఇది చూసి చలించిన మహిళా కానిస్టేబుల్ దివ్వాంగురాలిని ఎత్తుకొని మెట్లు దిగి ఆలయ ప్రాంగణం దాటించి  గొప్ప మనసు చాటింది. ఇదంతా ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో .. మహిళా కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఆ మహిళ పేరు షాలిని అని.. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్  అని  పోలీసులు తెలిపారు. షాలిని ఫొటోను  రాచకొండ పోలీస్ పేజీలో ట్వీట్ చేశారు. మహిళా కానిస్టేబుల్ చేసిన మంచి పనికి నెటిజన్లు అభినందనలు తెలుపుతూ రీట్వీట్ చేస్తున్నారు.