'అర్జున్ రెడ్డి'కి ఎప్పుడూ రుణపడి ఉంటా

'అర్జున్ రెడ్డి'కి ఎప్పుడూ రుణపడి ఉంటా

పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండకు బ్యూటీఫుల్ హీరోయిన్ షాలినీ పాండే కృతజ్ఞతలు తెలిపింది. ఆగస్టు 25 తన జీవితంలో మఖ్యమైన రోజు అంటూ చెప్పుకొచ్చింది. "ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను నటిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాను. 'అర్జున్ రెడ్డి' విడుదల తేదీ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమాలో నేను పోషించిన ప్రీతి పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకి.. దక్కిన ప్రేమకి ఎప్పుడూ రుణపడే ఉంటాను. 

'అర్జున్ రెడ్డి' షూటింగ్ టైంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నాకు ఎంతో ధైర్యం చెప్పారు. సందీప్ కు ధన్యవాదాలు.. విజయ్ నాకు సపోర్ట్ గా నిలిచి.. నాలో ఉత్సాహాన్ని నింపాడు. భయాన్ని.. కంగారు పోయేలా చేశాడు. అప్పటి నుంచి సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయేలా చేశాడు. అర్జున్ రెడ్డికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. లవ్ యూ విజయ్.. నీ లైగర్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని షాలినీ ఇన్ స్టాలో షేర్ చేసింది.

కాగా, విజయ్ దేవరకొండ, షాలినీపాండే హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2017 ఆగస్టు 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ లో రికార్టు క్రియేట్ చేసింది. ఈ సినిమ ఇవాళ్లికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షాలినీ సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం షాలిని పాండే బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalini Pandey (@shalzp)