
- పీపీఏ గడువు పూర్తితో రెండేండ్ల కింద ప్లాంట్ క్లోజ్
- కార్మికులకు సెంటిల్ మెంట్ చేయకుండా పెండింగ్
- రోడ్డున పడిన ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లే
- సెటిల్మెంట్కోసం మరోసారి కార్మికుల పోరుబాట
మంచిర్యాల, వెలుగు : శాలివాహన బయోమాస్, గ్రీన్ఎనర్జీ పవర్‌ప్లాంట్‌ను రెండేండ్ల కింద మూసివేసిన మేనేజ్మెంట్ఇటీవల ప్లాంట్భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. దీంతో పెండింగ్శాలరీస్, ఏరియర్స్, బోనస్‌తో పాటు సెటిల్మెంట్డబ్బుల కోసం రెండ్లేండ్లుగా పోరాడుతున్న కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. వారం రోజులుగా పవర్ప్లాంట్ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా మేనేజ్మెంట్మొండిపట్టు వీడి సెటిల్మెంట్కు ఒప్పుకోకపోతే అమ్మకానికి పెట్టిన ప్లాంట్భూముల్లో గుడిసెలు వేస్తామని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, లేబర్డిపార్ట్మెంట్స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
రెండేండ్ల కింద ప్లాంట్ క్లోజ్
2002లో పాత మంచిర్యాలలో పవర్‌ప్లాంట్‌ను 6 మెగావాట్ల కెపాసిటీతో పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమురయ్య ఏర్పాటు చేశారు. సింగరేణి బొగ్గు, రైస్‌మిల్లుల నుంచి వచ్చే ఊక, సామిల్స్నుంచి వచ్చే కర్ర పొట్టు ముడి పదార్థాలుగా కరెంట్ ఉత్పత్తి చేపట్టారు. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంట్‌ను ప్రభుత్వానికి సప్లై చేసేందు కు 20 ఏండ్ల గడువుతో పవర్పర్చేజ్అగ్రిమెంట్(పీపీఏ) కుదుర్చుకున్నారు. 2022 డిసెంబర్6తో పీపీఏ గడు వు ముగియడంతో కరెంట్ఉత్పత్తి నిలిపివేశారు.
అప్పట్లో కార్మికులు ప్రభుత్వం స్పందించి పీపీఏను పొడిగించాలని, ప్లాంట్‌ను పునరుద్ధరించాలని ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదు. వివిధ కారణాలతో పవర్ ప్లాంట్‌ను క్లోజ్చేయాలనే ఆలోచనతో మేనేజ్మెంట్ పీపీఏ కోసం ప్రయత్నించకుండానే ఇదే అదునుగా తీసుకుని లే ఆఫ్ప్రకటించింది.
రోడ్డున పడ్డ కార్మికులు..
పవర్ ప్లాంట్ప్రారంభంలో 300 మందికిపైగా కార్మికులు ఉండగా, క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. క్లోజ్ చేసేనాటికి 100 మంది పర్మినెంట్, మరో 100 మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. అరకొర జీతాలు చెల్లించగా.. ఎప్పటికైనా పెరగకపోతాయనే ఆశతో ఉన్న కార్మికులపై ప్లాంట్మూసివేత పిడుగు పడ్డంత పనైంది. మూడేండ్ల పెండింగ్ఏరియర్స్, బోనస్‌తో పాటు జీతాలు, పీఎఫ్, గ్రాట్యుటీ డబ్బులు చెల్లించి సెటిల్మెంట్చేయాలని కార్మికులు రెండేండ్ల నుంచి పోరాడుతున్నా మేనేజ్మెంట్పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Also Read :- స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లలో కాసుల దందా!
ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రావాల్సి ఉంది. అయితే.. రూ.లక్ష నుంచి రూ.2లక్షలు మాత్రమే చెల్లిస్తామనడంతో వ్యతిరేకించారు. అప్పటినుంచి దశల వారీగా ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం, మేనేజ్మెంట్ తమ గోడు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ప్లాంట్‌నే నమ్ముకొని బతికామని, 50 ఏండ్ల వయసులో ఇతర పనులు దొరక్క తిండికి తిప్పలు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు.
వేలల్లో కొనుగోలు చేసి..
పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అప్పట్లో పాత మంచిర్యాల శివారులోని భూములను ఎకరం రూ.60 వేలకే మేనేజ్ మెంట్ కొనుగోలు చేసినట్టు కార్మికులు పేర్కొన్నారు. 11 మంది రైతుల నుంచి సుమారు 36 ఎకరాలు సేకరించగా, వారికి ప్లాంట్‌లో పర్మినెంట్జాబ్ లు ఇస్తామని హామీ ఇచ్చింది. వివిధ కారణాలతో కార్మికుల సంఖ్యలో కోత పెడుతూ 100 మందికి కుదించింది. 10 ఎకరాలను గతంలోనే అమ్ముకోగా, మిగిలిన 26 ఎకరాలను ఇటీవల అమ్మకానికి పెట్టినట్టు కార్మికులు తెలిపారు.
మంచిర్యాల, హైదరాబాద్‌కు చెందిన కొందరు రియల్టర్లు రూ.2.50 కోట్లకు ఎకరం చొప్పున కొనుగోలు చేయడానికి ముందుకురాగా.. ఇప్పటికే 6 ఎకరాలకు బయానా కట్టినట్టు చెప్తున్నారు. భూముల అమ్మకం ద్వారా రూ. కోట్లలో వెనకేసుకుంటున్న మేనేజ్మెంట్తమతో సెటిల్మెంట్కు ముందుకు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లేదు
పవర్ప్లాంట్మేనేజ్మెంట్మల్క కొమురయ్యకు బీజేపీ అండదండలు ఉన్నాయి. గతంలో ఆయన మల్కాజిగిరి ఎంపీ టికెట్‌కోసం ప్రయత్నించినప్పుడే ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ లీడర్లకు విన్నవించాం. తాజాగా ఆ పార్టీ తరఫున కరీంనగర్ టీచర్స్ఎమ్మెల్సీ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్నాడు. మేం న్యాయం కోసం రెండేండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడంలేదు. బీజేపీ అగ్ర నేతలు స్పందించి పవర్ప్లాంట్కార్మికులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం.
- కుంటాల శంకర్, పపర్ ప్లాంట్ వర్కర్స్‌యూనియన్ ప్రెసిడెంట్
మా భూములు మాకు ఇప్పించాలి
పవర్ ప్లాంట్ కు మేం 8 ఎకరాల భూమి ఇచ్చాం. ఎకరానికి రూ.60 వేలు చెల్లించారు. భూమి పోయినా పర్మినెంట్జాబ్ ఉంటుందని అనుకున్నాం. ప్లాంట్ప్రారంభం నుంచి చేస్తున్నా. ఇప్పుడు మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. 50 ఏండ్ల వయసులో చేద్దామంటే ఏ పని దొరకట్లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మనస్తాపంతో ఇద్దరు, ముగ్గురు కార్మికులు చనిపోయారు. ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన పెండింగ్డబ్బులు ఇప్పించాలె. ఉపాధి కోల్పోయినందున మా భూములు మాకు ఇప్పించాలి.
- నిమ్మరాజుల సత్యనారాయణ, ల్యాండ్లూజర్, పవర్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ జనరల్సెక్రటరీ