మారుమూల గ్రామం నుంచి వచ్చి టాప్ బ్యాటర్లనే ఔట్ చేశాడు.. ఎవరీ విండీస్ పేసర్?

మారుమూల గ్రామం నుంచి వచ్చి టాప్ బ్యాటర్లనే ఔట్ చేశాడు.. ఎవరీ విండీస్ పేసర్?

షమర్ జోసెఫ్..వెస్టిండీస్ కు చెందిన ఒక సాధారణ పేస్ బౌలర్. ఆసీస్ పై తొలి టెస్టు ప్లేయింగ్ 11 లో ఇతని పేరు ప్రకటించగానే బౌలర్లు ఎవరూ లేక ఆడిస్తున్నారనుకున్నారు. నెంబర్ 11 లో బ్యాటింగ్ కి వచ్చినప్పుడు 5 నిమిషాల క్రీజ్ లో ఉంటే గొప్పే అనుకున్నారు. బౌలింగ్ వచ్చినప్పుడూ వికెట్ తీయడమే గగనం అనుకున్నారు. కానీ తొలి రోజు ఆటలో ఏదైనా హైలెట్ ఉందంటే అది ఈ పేస్ బౌలర్ అద్భుత ప్రదర్శన మాత్రమే.

మొదట బ్యాటింగ్ లో 41 బంతుల్లో 36 పరుగులు చేసి విండీస్ పరువు కాపాడాడు. ఇది గాలివాటమే అయినా ఆ తర్వాత అసలైన సీన్ జరిగింది. ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లను ఔట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పకున్నాడు. స్మిత్,లబుషేన్ ఆసీస్ జట్టులో ఎంత కీలక ప్లేయర్లు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంతగడ్డపై వీరిని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ జోసెఫ్ తన పదునైన బంతులతో తొలి రోజు వీరిద్జరిని పెవిలియన్ కు పంపి విండీస్ కు శుభారంభం అందించాడు.

తన తొలి బంతికే స్మిత్ వికెట్ ను తీసిన జోసెఫ్.. టెస్టుల్లో 85 ఏళ్ళ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి విండీస్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.  జోసెఫ్ చేసిన ఈ అద్భుత ప్రదర్శన తర్వాత ఈ విండీస్ క్రికెటర్ గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు. ఇంతకీ షమర్ జోసెఫ్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 

గయానాలోని బరాకర అనే చిన్న గ్రామంలో షమర్ జోసెఫ్ జన్మించాడు. 2018 వరకు సరైన టెలిఫోన్,ఇంటర్నెట్ సేవ వంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా ఉన్న ఊరిలో పెరిగాడు. క్రికెట్ మీద ఇష్టంతో టేప్-బాల్ క్రికెట్ ఆడేవాడు. కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్‌ లాంటి లెజెండరీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల హైలైట్ రీల్స్‌ను చూస్తూ క్రికెట్ పై తన ఇష్టాన్ని పెంచుకున్నాడు. సిటీకి రావాలంటే పడవలో రెండు రోజులు ప్రయాణం చేయాల్సిందే.       
 
క్రికెటర్ కాకముందు జోసెఫ్ తన కుటుంబాన్ని పోషించడానికి బాడీగార్డ్‌గా పనిచేశాడు. అయినప్పటికీ.. క్రికెట్ పై ఇష్టాన్ని వదుకోలేక క్రికెట్‌ను కొనసాగించాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని పట్టుదలతో ఫిబ్రవరి 2023లో గయానా హార్పీ ఈగల్స్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈ సీజన్ లో మూడు మ్యాచ్ ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
 
నేడు జరిగిన అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ బౌలర్ల ధాటికి 188 పరుగులకే కుప్పకూలింది. మెకంజీ 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోసెఫ్ 36 పరుగులు చేశాడు. హేజాల్ వుడ్, కమ్మిన్స్ కు చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమాయానికి 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఖావాజ(30),గ్రీన్ (6)క్రీజ్ లో ఉన్నారు.