రిసార్టులో పెళ్లి విందు.. గుండెపోటుతో RMP డాక్టర్ మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. మిత్రుడి పెళ్లి విందుకు వచ్చి హోటల్లో నిద్రిస్తు ఓ RMP డాక్టర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..

శామీర్ పేట మండలం బొమ్మ రాసిపేటలోని లియోనియా రిసార్ట్ లో నిన్న(ఫిబ్రవరి 15) తన మిత్రుడి వివాహ విందుకు హాజరయ్యాడు భరత్ రెడ్డి. వివాహ వేడుకల్లో పాల్గొన్న తర్వాత రిసార్ట్ లోని రూమ్ కి వెళ్లి పడుకున్నాడు. అయితే మరుసటి రోజు విందుకు వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో మృతుని భార్య చేతన రిసార్ట్ వారికి ఫోన్ చేసింది. అయితే అక్కడ ఎవరూ లేరని రిసార్ట్ వారు సమాధానం చెప్పారు. అనుమానం  వచ్చి రిసార్ట్ సిబ్బంది గదికి వెళ్లి చూడగా.. భరత్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. 

ఈ సమాచారాన్ని భరత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, పోలీసులకు అందజేశారు రిసార్ట్ సిబ్బంది. సమాచారం మేరకు ఘటనా స్థలనికి చేరుకున్న శామీర్ పేట పోలీసులు.. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని  గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతనికి అస్తమ, జబ్బు ఉందని..  హార్డ్ స్ట్రోక్ తో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కల్వకుర్తికి చెందిన  భరత్ రెడ్డి(37) ఆర్.ఎం.పి డాక్టర్ గా సేవలందిస్తున్నాడు భరత్ రెడ్డి.