IND vs AUS: ఇవే తగ్గించుకుంటే మంచిది.. అప్పుడేమో అలా అన్నావు,ఇప్పుడేమైంది

IND vs AUS: ఇవే తగ్గించుకుంటే మంచిది.. అప్పుడేమో అలా అన్నావు,ఇప్పుడేమైంది

ఫామ్ లో ఉన్నాను.. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన చెల్లుతుంది అనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ వ్యాఖ్య ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కి సరిగ్గా సరిపోతుంది. కొన్ని నెలల క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో మేము 450 పరుగులు చేసి భారత్ ని 65 పరుగులకే ఆలౌట్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు గత నెలలో మాతో పాకిస్థాన్ జట్టు 2023 వరల్డ్ ఫైనల్ ఆడుతుందని అత్యుత్సాహం ప్రదర్శించాడు. అయితే మార్ష్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది.
 
నాలుగు పరుగులకే పెవిలియన్ కి

భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది. భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఆసీస్ ఓపెనర్ ఓపెనర్ మార్ష్ తొలి ఓవర్లోనే షమీ బౌలింగ్ లో పెవిలియన్ కి చేరాడు. రెండో బంతికే బౌండరీ బాదిన మార్ష్.. నాలుగో బంతికి స్లిప్ లో గిల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ పై ఏదో చేద్దామనుకున్న మార్ష్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. మొత్తానికి టీమిండియాను తక్కువగా అంచనా అంచనా వేస్తే ఎలా ఉంటుందో మార్ష్ కి అర్ధమయ్యే ఉంటుంది.